Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి ఇప్పారుగా గ్రామ నివాసులైన దత్తు పాటిల్ మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా ఖానాపూర్ గేట్ వద్ద నూతనంగా హోటల్ పెట్టుకున్న దానికి శుక్రవారం మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఉపాధి కోసం ఎక్కడైనా జీవించుకోవచ్చని మహారాష్ట్రలో హోటల్ నడపడానికి దత్తు పాటిల్ ప్రారంభించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు సర్పంచులు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దత్తు పాటిల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.