Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటేశ్వర్
గత సంవత్సరం ఉదయం హైదరాబాదు నుండి నిజాంబాద్ కు వచ్చిన దేవగిరి ట్రైన్ రన్నింగ్ ట్రైన్ నుండి ఓ మహిళ దిగే ప్రయత్నం చేయగా మహిళా తల ట్రైన్ మధ్యలో ఇరుక్కునే సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ కుమారి సరళ తన ప్రాణాలను చూడకుండా ఆ మహిళ ప్రాణాలను కాపాడింది. ఈ ఘటనను ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అందుకు నిదర్శనమే ఈ అవార్డు. ఈనెల 11న నిజామాబాద్ చెందిన ఆర్ పి ఎఫ్ మహిళ కానిస్టేబుల్ కుమారి సరళ 506, దక్షిణ మధ్య రైల్వే నుండి హైదరాబాద్ డివిజన్ వార్దీ నహీయే కాల్ హై సిటిజన్ గాలంట్ వారియర్ అవార్డు 2023 అవార్డుతో పాటు మాజీ రాష్ట్రపతి నుండి రూ. 50,000/- నగదు పురస్కారం అందుకున్నారు. భారతదేశం శ్రీ రామ్ నాథ్ కోవింద్ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, 15 జనపథ్, న్యూఢిల్లీ నగదు పురస్కారం అందుకుంది. ఇందుకు నిజామాబాద్ ఆర్పిఎఫ్ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.