Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
విజయ్ దేవరకొండ టైటిల్ రోల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. అయితే తాజాగా లైగర్‌తో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ముందు ఆందోళన చేపట్టారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైగర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే.. తమకు భారీగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లైగర్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమను ఆదుకుంటామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. అందువల్లే తాము రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నట్టు చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తామని అంటున్నారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. గతంలో డిస్ట్రిబ్యూటర్ల వ్యవహారంపై పూరీ ఓ ఆడియో టేప్ విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
‘మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా..? నేను ఎవరికీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకిస్తున్నా.. పాపం వాళ్లు కూడా నష్టపోయారనే సానుభూతితో మాత్రమే తిరిగివ్వాలనుకుంటున్నా. కొంత మొత్తాన్ని ఒక నెలలో ఇస్తానని ఇప్పటికే బయ్యర్లతో మాట్లాడాను. వాళ్లు ఒప్పుకున్నారు. వాళ్లను ఒక నెల టైం అడిగాను. నాకు కూడా రావాల్సింది ఉంది. ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఇలా ఓవరాక్షన్ చేస్తే.. ఇచ్చేది కూడా ఇవ్వబుద్ది కాదు. మేము ఎందుకిస్తున్నాం.. పరువు కోసం ఇస్తున్నాం. కానీ నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అయినా ఎగ్జిబిటర్స్ కు నాకు సంబంధం ఏంటీ ’ అంటూ పూరీ రిలీజ్ చేసిన ఆడియో పుటేజ్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరి తాజా ఆందోళనల నేపథ్యంలో పూరీ అండ్ ఛార్మీ టీం ఏదైనా స్పందిస్తేమో చూడాలి.