Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్తాన్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టును అక్రమం అని నిన్న పాక్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’(ఎన్ఏబీ)ని ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ‘ఆల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ఆయనను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.