Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్: ఎంజీఎం హస్పటల్ నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. పెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఈ ఎంజీఎం దవాఖానాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన ప్రస్తుతం తెలంగాణలో వైరల్ అవుతోంది. వృద్ధురాలైన ఓ పేషెంట్ పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలతో కర్కశకంగా వ్యవహరించారు. సదరు వృద్ధురాలికి కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో ఆమె భర్తే భుజాన వేసుకుని మోసుకెళ్లాడు. లక్ష్మి అనే వృద్ధురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినది. నెల రోజుల క్రితం ఎంజీఎం డాక్టర్లు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు. నెల తర్వాత లక్ష్మిని చెకప్ కోసం ఆమె భర్త ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే పెద్దసారు(కన్సల్ట్ డాక్టర్) లేరని, రేపు రావాలంటూ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. బయటకు వెళ్లేందుకు కనీసం స్ట్రెచర్ అయినా ఇవ్వాలని కోరినా.. సిబ్బంది దానికి నిరాకరించారు. దీంతో చేసేది లేక లక్ష్మిని ఆమె భర్త భుజాలపైకి ఎక్కించుకుని బయటకు మోసుకెళ్లాడు.