Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో శుక్రవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని సమాచారం. మావోయిస్టు మృతిని పోలీసులు ధ్రువీకరించారు. సుక్మా జిల్లా సిరిసిట్టి కోడెల్పర అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మావోయిస్టుల ఆచూకీ గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే కాల్పులు చోటు చేసుకున్నట్లుగా సమాచారం.