Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ కు జరిమానా విధించింది ఐపీఎల్. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను బట్లర్ కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 కింద లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు అతడు పాల్పడినట్లు తెలిపింది. ఇందులో మ్యాచ్ రెఫరీ నిర్ణయమే అంతిమమని ఐపీఎల్ తెలిపింది. మ్యాచ్ సమయంలో బట్లర్ ప్రవర్తనపై ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ, రనౌట్ అయిన సమయంలో అతడి వ్యవహారశైలి కారణంగా జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.