Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో పొత్తు కచ్చితంగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను జూన్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుడతానని చెప్పారు. డిసెంబర్ లో ఎన్నికలు రావొచ్చునని జోస్యం చెప్పారు. ఏపీ భవిష్యత్తు కోసం అలయెన్స్ తప్పనిసరి అని, పొత్తుకు నేను సిద్ధంగా ఉన్నానని, కానీ వారు వద్దనుకుంటే నాకు తెలియదని చెప్పారు. తనను ముఖ్యమంత్రి అని నినాదాలు ఇచ్చేవారికి ఒకటే చెబుతున్నానని, జనసేనకు 48 శాతం ఓటింగ్ ఇస్తే, అప్పుడు నేనే సీఎం అవుతానని చెప్పారు. అంత ఓటు రానప్పుడు మనం ఎలా అడగగలమన్నారు.