Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని మురళీధర్బాగ్లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించామని అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రూ.2 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఆడబిడ్డ పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని మంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టామన్నారు. పాతబస్తీని సీఎం కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్ సంస్కృతిని కాపాడుతున్నామని చెప్పారు.