Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఖమ్మం జిల్లా దవాఖానకు 'బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్' గుర్తింపు దక్కింది. ముర్రుపాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు 'బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్' (బీఎఫ్హెచ్ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్ అందజేయనున్నారు. ఖమ్మంతో కలిపి రాష్ట్రంలో ఆరు దవాఖానలకు మాత్రమే బీఎఫ్హెచ్ గుర్తింపు పొందాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాన్సువాడలోని ఎంసీహెచ్ మొదటి బీఎఫ్హెచ్ఐ సర్టిఫికెట్ సాధించింది.
ఆ తర్వాత జనగాం ఎంసీహెచ్, గజ్వెల్ ఏరియా హస్పిటల్, సూర్యాపేట ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ ఈ గుర్తింపు పొందాయి. తద్వారా దేశంలోనే అత్యధిక బీఎఫ్హెచ్ఐ అక్రిడేటెడ్ ప్రభుత్వ దవాఖానలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయనడానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది.