Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిద్ధరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో మీడియా ప్రతినిధులు సీఎం ఎవరని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. సీఎం వ్యవహారంలో ఆ ముగ్గురిదే నిర్ణయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము 141 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీల కన్నా తమ సర్వేలో సేకరించిన శాంపిల్స్ సంఖ్య అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి మూలకు వెళ్లానని ఆయన చెప్పారు. ఎన్ని సీట్లు వచ్చినా దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం తామేనని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ అది వారి భ్రమేనని అన్నారు.