Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. ప్రతి నెలా ఆన్లైన్లో దర్శన, వసతి గదుల కోటా విడుదలకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రతి నెలా 18 నుంచి 20 వరకు లక్కీడిప్ విధానంలో ఆర్జితసేవా టికెట్లు, 21న వర్చువల్ సేవా టికెట్లు, 23న శ్రీవాణి, అంగ ప్రదక్షిణం, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 25న గదుల కోటా విడుదల చేస్తామని తెలిపారు.