Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 1401 కార్పొరేటర్ల ఓట్ల లెక్కింపు సాగుతోంది. కార్పొరేటర్ల ఓట్ల లెక్కింపు అనంతరం 17 నగరాల్లో మేయర్ల ఎన్నిక జరగనుంది. నగర పాలిక పరిషత్ లో 5,260 మంది సభ్యుల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం 198 పట్టణాల్లో మున్సిపల్ ఛైర్ పర్సన్ల ఎన్నిక జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం 353 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.