Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో రానున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కన్నడనాట రాజకీయ ఆనవాయితీ పునరావృతం అవుతుందా?.. లేదా ఈసారి ఓటర్లు దానికి భిన్నంగా అడుగులు వేశారా? అనేది మరికొన్ని గంటల్లో తేలబోతోంది. 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 38 ఏళ్లలో ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాకపోవడం కర్ణాటకలో ఆనవాయితీగా ఉంది. ఈసారి కాంగ్రెస్‌కే స్వల్పంగా మొగ్గు ఉంటుందని పలు ఎగ్జిట్‌పోల్స్ చెప్పడం, జేడీఎస్‌ది కీలకపాత్ర అవుతుందని అంచనా వేయడం వల్ల నేతలు, ప్రజల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. 224 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 73.19 శాతంతో రికార్డుస్థాయి పోలింగ్ నమోదయ్యింది. దీంతో ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందన్న అంచనా మొదలైంది. మధ్యాహ్నం నాటికి ఫలితాల్లో స్పష్టత రావచ్చని భావిస్తున్నారు.