Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్థాన్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో ఉండగా బయట కాల్పులు జరిగాయి. కాల్పులు వాస్తవమే కానీ, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు. జి-11, జి-13 సెక్టార్లో పోలీసులుపై కాల్పులు జరిగినట్టు పేర్కొన్నారు. పలు కేసుల విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కాల్పులు జరిగినట్టు ‘డాన్.కామ్’ పేర్కొంది. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు వద్ద భద్రతను పెంచారు. ఆ తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.