Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ- కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పలు రైళ్లను వేసవి రద్దీ కారణంగా పొడిగించనున్నట్లు తెలిపింది. మే 13 (శనివారం)న రైలు నెంబర్ 07417 కాచిగూడ నుంచి రాత్రి 8:45 గంటలకు బయలుదేరి మే 14 (ఆదివారం) ఉదయం 8:40 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. రైలు నెంబర్ 07418 కాకినాడ టౌన్లో మే 14 (ఆదివారం) రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మే 15 (సోమవారం) ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ కోచ్ లతో పాటు జనరల్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు వివరించారు. ఈ రైళ్లకు కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు..
హైదరాబాద్- తిరుపతి మధ్య ప్రతీ సోమవారం నడిచే స్పెషల్ ట్రైన్ (నెంబర్ 07643) ను జూన్ 26 వరకు, తిరుపతి- హైదరాబాద్ మధ్య ప్రతీ మంగళవారం నడిచే స్పెషల్ ట్రైన్ (నెంబర్ 07644) ను జూన్ 27 వరకు, తిరుపతిఉ సికింద్రాబాద్ మధ్య ప్రతీ ఆదివారం నడిచే ట్రైన్ (నెంబర్ 07481)ను జూన్ 25 వరకు, సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రతీ సోమవారం నడిచే ట్రైన్ (నెంబర్ 07482)ను జూన్ 26 వరకు, హైదరాబాద్- నర్సాపూర్ మధ్య ప్రతీ శనివారం నడిచే స్పెషల్ ట్రైన్ (నెంబర్ 07631) ను జూన్ 24 వరకు పొడిగించినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.