Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక: బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గత నాలుగు నెలలుగా అనేక సార్లు స్వయంగా వెళ్లి పర్సనల్గా బీజేపీ మాజీ ఎంపీ సంగ్లియానాను కలిసామని అన్నారు. అంతేకాకుండా రెండు సంవత్సరాలుగా ప్రజాశాంతి పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిందని ఆయన చెప్పారు. అలాగే బీజేపీ పార్టీ మద్దతుతో జేడీఎస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టారని విన్నామని అన్నారు. అక్కడ బీజేపీ పార్టీ, జేడీఎస్ పార్టీని ఓడించాలని ప్రార్థించామని.. అందుకోసం ప్రయత్నించాం.. చివరకు ఓడించి కర్ణాటకను రక్షించామని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పేర్కొన్నారు.