Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. "ఇదీ... దక్షిణ భారతదేశం అంటే! బీజేపీ పాలన నుంచి విముక్తి కలిగిస్తూ కర్ణాటకలో ఎన్నికల తీర్పు వచ్చింది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇంతే. బీజేపీ పతనం దక్షిణాది నుంచే మొదలైంది. ఇక ప్రతి చోటా వాళ్ల ఖాతాలు మూసుకోవాల్సిందే. తెలంగాణలో అయితే వాళ్లకు డిపాజిట్లు కూడా రావు" అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.