Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులేత్తేసింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ దాదాపుగా నిష్క్రమించినట్లే. సన్‌రైజర్స్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ.. 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రేరక్ మన్కడ్ (64; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించగా.. చివర్లో నికోలస్ పూరన్ (44; 13 బంతుల్లో) విధ్వంసం సృష్టించాడు. స్టాయినిస్ (40; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (47; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అన్మోల్ప్రీత్ సింగ్ (36; 27 బంతుల్లో 7 ఫోర్లు), అబ్దుల్ సమద్ (37; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) నిరాశపర్చగా.. రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28) పరుగులు చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో కృనాల్ పాండ్య 2, యుధ్విర్ సింగ్, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.