Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఇంతటి చారిత్రక విజయం అందించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. భారత్ ను ఏకం చేసేందుకు లభించిన విజయం ఇది అన్నారు. మీ కఠోర శ్రమ గొప్ప ఫలితాన్ని ఇచ్చిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నిర్విరామంగా పని చేస్తుందన్నారు. దేశాన్ని ఏకం చేసే రాజకీయ విజయం ఇది అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక విజయం అందించినందుకు కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.... కర్ణాటక అభివృద్ధికి ఈ విజయం నిదర్శనం అన్నారు ప్రియాంక. ఈ గెలుపు కోసం పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మీ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. జై కర్ణాటక.. జై కాంగ్రెస్ అని ట్వీట్ చేశారు.