Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త చంపి బెడ్ కింద మృతదేహాన్ని దాచిపెట్టిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో జరిగింది. 1996లో దీపా బాయ్‌ని వినయ్ పార్మర్ వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ దంపతులకు 21 ఏళ్ల కూతురు, 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వినయ్ తన భార్యతో విడాకులు తీసుకోవాలని వినయ్ నిర్ణయం తీసుకున్నాడని దీపా సోదరుడు ఆరోపణలు చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీపా స్థానికుల పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. తన భార్యతో కలిసి ఉంటానని చెప్పి దీపాను వినయ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. భార్యను భర్త హత్య చేసి బెడ్ కింద మృతదేహాన్ని దాచి పెట్టాడు. పోలీసులు వినయ్ ఇంటికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్నారు. దీపా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ అతడి తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి తన కూతురు చంపేశారని దీపా తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు.