Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. దాదాపు 25 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ కల్తీ మద్యం కలకలం సృష్టించింది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. సముద్ర తీరంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో బాధితులు మద్యం తాగారని.. అనంతరం ఇంటికి వచ్చి స్పృహ కోల్పోయారని పోలీసులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బాధితుల్లో కొంత మంది చికిత్స పొందుతూనే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.