Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఐదురోజుల పాటు సజావుగా సాగిన ఎంసెట్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలు నిర్వహించగా, 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షలకు 94.11 శాతం విద్యార్థులు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షల ఫలితాలు ఈ నెల చివరి వారంలో విడుదల కానున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు.. ఈ నెల 26 నుంచి 30 తేదీల మధ్య ఫలితాలను విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ సారి ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ నిబంధనను ఎత్తివేశారు. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకణ, ఫైనల్ కీ విడుదల, నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం ఫలితాలను విడుదల చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు.