Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాటియాలా: పంజాబ్‌లోని ఓ గురుద్వారాలో మద్యం సేవించిన మహిళను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన పాటియాలా గురుద్వారాలో ఆదివారం సాయంత్రం జరిగింది. పర్మీందర్ కౌర్ అనే మహిళ దుక్నీవార్న్ సాహిబ్ గురుద్వారాలో ఉన్న సరోవర్ వద్ద మద్యం సేవిస్తూ కనిపించింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న నిర్మల్జిత్ సింగ్ అనే వ్యక్తి ఆ మహిళను కాల్చి చంపాడు. 32 ఏళ్ల పర్మీందర్ కౌర్ అర్బన్ ఎస్టేట్ ఫేజ్ 1లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యం తాగుతున్న విషయాన్ని గురుద్వారా బోర్డుకు ఫిర్యాదు చేద్దామనుకున్న లోపేనిర్మల్జిత్ 32 బోర్ లైసెన్స్డ్ రివాల్వర్‌తో ఆ మహిళపై అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆమెను హాస్పిటల్‌కు తీసుకువెళ్లినా.. ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనో ప్రాపర్టీ డీలర్ అని, అతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమీలేదని పోలీసులు చెప్పారు.