Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ లెజిస్టేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గం.కు జరిగే ఈ సమావేశంలో ఆ పార్టీ ఎంపిలు, ఎంఎల్సిలు పాల్గొననున్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఫలితాలు రాష్ట్రంలో ఏ మేర కు ప్రభావం చూపుతాయన్న అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. పార్టీ కార్యవర్గం సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు కూడా హాజరు కావాలని కెసిఆర్ ఆదేశించారు.