Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద కారు బోల్తా పడటంతో నారాయణ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన కారు డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు.