Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్ కూడలి వద్ద జరిగింది. సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. వారి వివరాలు మాత్రం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.