Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అనుమానితుడిని సంఘటనా స్థలంలోనే హతమార్చినట్లు ఫార్మింగ్టన్ పోలీసు విభాగం పోస్‌బుక్ పోస్టులో తెలిపింది. కాల్పుల్లో గాయాలకు గురైన ఇద్దరు చికిత్స పొందుతున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, నిందితుడి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ఘటన తర్వాత స్కూల్‌ను మూసివేశారు. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తెరిచేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. కాల్పులకు కారణం తెలియరాలేదని, విద్యార్థులు, సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని వివరించారు.