Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఆరంభంలో నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. సూచీలకు ఆరంభంలో అమ్మకాల సెగ తగిలింది. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంతో 62,286 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 18,392 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పుంజుకొని 82.20 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, విప్రో, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టైటన్, టాటా మోటార్స్, టీసీఎస్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.