Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మేడ్చల్: మున్నా బోరంపేట అపురూప కాలనీలో ఈరోజు చిరుత జాడలు చూసి హడలెత్తిపోయారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతూ బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. చిరుత సంచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు కాలనీని సందర్శించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇది చిరుతపులి కాదని, అడవి కుక్క ఆనవాలుగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఈ వీడియోను ఎవరు పోస్ట్ చేశారని ఆరాతీస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు భయభ్రాంతులు చేసే వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చిరుత ఆనవాళ్లు కాదని, అడవి కుక్క ఆనవాల్లుగా ఉన్నాయని ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయవద్దని, ఒకవేళ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.