Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ కార్యాలయానికి వెళ్లిన సోమా భరత్
న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున ఆ పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కె.కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. తాము కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో తెలిపారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం, లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొంది. అందువల్ల కవిత తరపున ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ మంగళవారం వెళ్లారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.