Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో బీబీసీ పంజాబ్ న్యూస్ ఖాతాను ట్విట్టర్ విత్‌హెల్డ్‌లో ఉంచిం ది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ట్విట్టర్ సంస్థ దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమా చారం ఇవ్వలేదు. ఖలిస్థాన్ డిమాండ్ మద్దతుదారుడు అమృత్‌పాల్ సింగ్, అతని అనుచరులు కోసం పంజాబ్ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగి స్తున్న సమయంలో ఇలాంటి చర్య జరిగింది. బిబిసి పంజాబ్ న్యూస్ ఖాతాతో పాటు దాదాపు 120 ఖాతా లపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించినట్లు సమాచారం. వీటిలో జర్నలిస్టులు, ఉద్యమకారులు, ప్రము ఖల ఖాతాలతో పాటు శిరోమణి అకాళీదళ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు సిమ్రాన్‌జిత్ సింగ్ ఖాతా కూడా ఉంది. అలాగే పంజాబ్‌లో అనేక ప్రాంతాల్లో గత వారం రోజుల నుంచి మొబైల్ ఇంటర్నెట్ను కూడా నిలిపివేశారు.