Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీలు 340.. ఓబీసీలు 695 మంది
- ఐదేండ్లలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్లుగా నియమితులైంది వీరే : కేంద్రం సమాచారం
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రతి ష్టాత్మకమైన ఆలిండియా సివిల్ సర్వీసులకు ఎంపికవుతున్న ఎస్సీ, ఎస్టీల సంఖ్య చాలా తక్కువగా ఉంటు న్నది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసులకు యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులు అధిక సంఖ్యలో ఎంపికయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ అలాంటి పరిస్థితులేమీ కనిపించడం లేదు. 2018-2022 మధ్య గత ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాల నుంచి సివిల్ సర్వీసులకు తక్కువ మొత్తంలో ఎంపికైన అభ్యర్థుల సంఖ్యను చూస్తే ఇది అర్థమవుతున్నది. కేంద్రం వెల్లడించిన అధికారిక సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
4365 మందిలో ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలు 1201 మంది
కేంద్రం సమాచారం ప్రకారం.. సివిల్ సర్సీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి మూడు విభాగాలకు చెందిన 4365 పోస్టులకు గానూ ఎస్టీలు 166 మంది, ఎస్సీలు 340 మంది, ఓబీసీలు 695 మంది ఎంపిక య్యారు. నియామకం జరిగిన మొత్తం పోస్టులకు ఈ మూడు సామాజిక వర్గాల నుంచి నియమితులైనవారి సంఖ్య 1201గా (27.51శాతం) ఉన్నది.
ఇందులో 2,163 ఐఏఎస్ పోస్టులకు ఎస్టీలు 68 మంది, ఓసీలు 140 మంది, ఓబీసీలు 288 మంది నియమితులయ్యారు. 1403 ఐపీఎస్ పోస్టులకు ఎంపికైనవారిలో ఎస్టీలు 62 మంది, ఎస్సీలు 129 మంది, ఓబీసీలు 229 మంది ఉన్నారు. అలాగే, 799 మంది ఐఎఫ్ఎస్ అభ్యర్థులు నియమితులు కాగా.. ఇందులో ఎస్టీలు 36 మంది, ఎస్సీలు 71 మంది, ఓబీసీలు 178 మంది ఉన్నారు.