Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యధికంగా రైల్వేలో 2,93,943 ఖాళీలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అత్యధికంగా రైల్వేలో 2,93,943 పోస్టులు ఖాళీగా ఉండగా, రక్షణ శాఖలో 2,84,706 పోస్టులు, కేంద్ర హౌం శాఖలో 1,43,538 ఖాళీలున్నాయని మంత్రి పేర్కొన్నారు.