Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐజీ కె.ఆర్ చౌరాస్య నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం
- ప్రస్తుత విచారణాధికారి రాంసింగ్ తొలగింపు
- ఏప్రిల్ 30లోగా కుట్ర కోణంపై దర్యాప్తు ముగించండి
- సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు సీబీఐ డీఐజీ కె.ఆర్ చౌరాస్య పర్యవేక్షణలో కొత్త సిట్‌ను అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. ఈ కేసు ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తొలగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ సి.టి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు వేగంగా సాగటం లేదనీ, విచారణాధికారి (ఐఓ)ని మార్చాలని కోరుతూ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చింది. హత్య కేసు విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు ఏప్రిల్ 30లోగా దర్యాప్తును ముగించాలని స్పష్టం చేసింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలుకాకపోతే ఈ కేసులో ఏ5 నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. సీబీఐ డీఐజీ కె.ఆర్ చౌరాస్య పర్యవేక్షణలో కొత్త సిట్‌లో సభ్యులుగా ఎస్పీ వికాస్ కుమార్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ, ఇన్స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉన్నారు. అయితే సీబీఐ ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తొలగించింది.