Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర అసెంబ్లీలో పోర్న్ చూస్తూ చిక్కిన ప్రజాప్రతినిధి
అగర్తలా : మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏంచేస్తుంటారు..ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన చట్టసభలో బీజేపీకి చెందిన ఓ డర్టీ ఎమ్మెల్యే అశ్లీల చిత్రాలను చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే...
త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే పోర్న్ వీడియో చూస్తున్నారని ఆరోపించారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ వీడియో మార్చి 30 నాటిది (గురువారం రోజు). అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే..తన స్మార్ట్ ఫోన్ తీసుకుని అశ్లీల వీడియోలు చూసుకునే పనిలో బిజీఅయిపోయారు. ఇంతలో.. ఎమ్మెల్యే వెనుక నుంచి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అంతే ఈ వీడియో వైరల్ అయిపోయింది.మనం అసెంబ్లీకి ఇలాంటి వాడినా ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నదని అక్కడి జనం అనుకుంటున్నారు.
సదరు ఎమ్మెల్యే ఏమంటున్నారంటే..
ఇది కుట్రపూరితంగా జరిగిందని ఎమ్మెల్యే చెబుతున్నారు. దీనిపై పార్టీకి వివరణ ఇస్తానని డర్టీ ఎమ్మెల్యే అంటున్నారు.జదబ్ లాల్ నాథ్ త్రిపురలోని బగ్బాసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2012లో కర్నాటక అసెంబ్లీలోనూ ఇదే తరహా..
2012లో కర్నాటకలో కూడా ఇదే కేసు వచ్చింది.అప్పటి బీజేపీ ప్రభుత్వంలోని సహకార శాఖ మంత్రి లక్ష్మణ్ సవాది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీసీ పాటిల్ అశ్లీల వీడియోలు చూస్తుండగా పట్టుబడ్డారు. అపుడు వారు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడే అడ్డంగా దొరికిపోయారు. మంత్రుల నీలి చర్యను అసెంబ్లీ కార్యక్రమాలను కవర్ చేస్తున్న స్థానిక ఛానెల్ క్యాచ్ చేసింది. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి నల్ల మచ్చ అని మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి అప్పట్లో వ్యాఖ్యానించిన విషయం విదితమే.