Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ పెంపు ఇదే తొలిసారి
- నేటీ నుంచి అమలకు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహంతో సహా నిత్యం వాడే మందుల ధరలు భారీగా పెరగనున్నాయి. నేటీ (ఏప్రిల్ 1) నుంచి ధరలు అమలులోకి రానున్నాయి. 27 రకాల చికిత్సలకు సంబంధించిన 384 నిత్యావసర ఔషదాలు, 1,000 కంటే ఎక్కువ ఫార్ములేషన్స్ ధరలను 12.12 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది 10.7 శాతం ధరల పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) స్థూల ధరల సూచీ పెరుగుదల ఆధారంగా అవసరమైన ఔషధాల ధరలను పెంచడానికి తయారీదారులను అనుమతించింది. జ్వరం మందులు (పారాసిటమాల్ వంటివి), యాంటి బయోటిక్స్ (అజిత్రోమైసిన్ వంటివి), అంటువ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు (బిపి), డయాబెటిస్ (షుగర్), చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, రక్తహీనత (ఫోలిక్ యాసిడ్ వంటి ఔషధాలు), రక్తప్రసరణ సంబంధిత జబ్బులు, క్షయ (టిబి), వివిధ రకాల క్యాన్సర్లు వంటి వాటి మందులతోపాటు మినరల్, విటమిన్ మాత్రలు, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీఇన్ఫెక్టివ్స్ ధరలు పెరగనున్నాయి.
అవసరమైన మందుల జాబితాలోలేని మందులపై వార్షిక ధరలను 10 శాతం పెంచడాన్ని కమిటీ ఆమోదించింది. అయితే నిత్యావసర మందులకు 12 శాతం పెంపును అనుమతించడం ఇదే తొలిసారి. నాన్-షెడ్యూల్డ్ డ్రగ్స్‌కు అనుమతించిన దానికంటే ఎక్కువ పెంపుదల జరగడం ఇది వరుసగా రెండో సంవత్సరం. 2013లో ఔషధ ధరల నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత, ప్రతి సంవత్సరం మందుల ధరలను సవరిస్తూ వచ్చిన తరువాత ఇంత భారీ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతకు ముందు ప్రతి మూడేండ్లకు ఒకసారి ధర పెంపు ఉండేది. ధరల పెంపునకు ముందు, అవసరమైన మందుల జాబితాను సిద్ధం చేసే స్టాండింగ్ కమిటీ, 34 కొత్త మందులు, 26 మందులను మినహాయించి 384 మందుల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మందులను ఎంఆర్పి నమోదు చేసిన తరువాత అదే ధరకు విక్రయించాల్సి వస్తోంది. కొత్త స్టాక్ వచ్చినప్పుడు ధరలు మారుతాయి.
ఇది వినియోగదారులను దెబ్బతీసే అవకాశం ఉంది. వీరిలో చాలా మంది ఔషధాల ధరలు గతేడాది కంటే ఇప్పటికే 20 శాతం పెరిగాయని వినియోగదారులు చెబుతున్నారు. గత 12 నెలల్లో ప్రతి 10 మంది వినియోగదారుల్లో ఆరుగురు ఔషధాల ధరల్లో 20 శాతం పెరుగుదలను అనుభవించారని, మధుమేహం, రక్తపోటు, కీళ్లనొప్పులు, క్యాన్సర్‌కు సంబంధించిన ప్రత్యేక ఔషధాల ధరలు ఎక్కువగా పెరిగాయని ఒక సర్వేలో తేలింది.
కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో 58 శాతం మంది వినియోగదారులు సాధారణంగా ఉపయోగించే మందుల ఎంఆర్పి కంటే పెరిగినట్టు సూచించారని తేలింది. మెజారిటీ వినియోగ దారులు కేంద్ర ప్రభుత్వం ఔషధాలపై ట్రేడ్ మార్జిన్లను 50 నుంచి 100 శాతం వరకు పరిమితం చేయాలని కోరుకుంటున్నారని స్పష్టం అయింది.
- గత 12 నెలల్లో ప్రతి 10 మంది వినియోగ దారుల్లో ఆరుగురు ఔషధాల ధరల్లో 20 శాతం పెరుగు దలను అనుభవించారని, మధుమేహం, రక్తపోటు, కీళ్లనొప్పులు, క్యాన్సర్‌కు సంబంధిం చిన ప్రత్యేక ఔషధాల ధరలు ఎక్కువగా పెరిగాయని ఒక సర్వేలో తేలింది.
- 27 రకాల చికిత్సలకు సంబంధించిన 384 నిత్యావసర ఔషదాలు, 1,000 కంటే ఎక్కువ ఫార్ములేషన్స్ ధరలను 12.12 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గతేడాది 10.7శాతం ధరల పెంచారు.
- మెజారిటీ వినియోగ దారులు కేంద్ర ప్రభుత్వం ఔషధాలపై ట్రేడ్ మార్జిన్లను 50 నుంచి 100 శాతం వరకు పరిమితం చేయాలని కోరుకుంటున్నారని స్పష్టం అయింది.