Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొగ పీల్చి ఆరుగురు మృతి
- దేశరాజధాని ఢిల్లీలో ఘటన
న్యూఢిల్లీ : దోమల బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించే మస్కిటో కాయిల్ ఓకే కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం చోటు చేసుకుంది. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. శాస్త్రీ పార్క్ సమీపంలో నివాసం ఉండే ఓ కుటుంబం దోమలు కుట్టకుండా ఉండేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో మస్కిటో కాయిల్ వెలిగించారు. దాని నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చారు. దీంతో ఊపిరాడక నిద్రలోనే ఆ కుటుంబంలోని ఆరుగురు మృతి చెందినట్టు జోరు టిర్కీ వెల్లడించారు. మృతి చెందిన ఆరుగురిలో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు జోరు టిర్కీ వెల్లడించారు.