Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో రూ.3,532 కోట్లు, తెలంగాణలో రూ.4,804 కోట్లు వసూలు
న్యూఢిల్లీ :మార్చి నెలలో రూ.1,60,122 కోట్లు జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. అందులో రూ.29,546 కోట్లు సిజిఎస్టి, రూ.37,314 కోట్లు ఎస్జిఎస్టి, రూ.82,907 కోట్లు ఐజిఎస్టి (వస్తువులను దిగుమతిపై రూ.42,503 కోట్లు), రూ.10,355 కోట్లు సెస్ (వస్తువులు దిగుమతిపై రూ.960 కోట్లు) వసూలు అయినట్లు తెలిపింది. గతేడాది మార్చి (రూ.1,01,983 కోట్లు)తో పోల్చితే ఇప్పుడు 14.39 శాతం వసూలు పెరిగిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో గతేడాది మార్చిలో రూ.3,174 కోట్లు వసూలు అయితే, ఈ మార్చిలో రూ.3,532 కోట్లు వసూలు అయిందని తెలిపింది. గతేడాదితో పోల్చితే, 11.26 శాతం వసూలు పెరిగింది. తెలంగాణలో గతేడాది మార్చిలో రూ.4,242 కోట్లు వసూలు అయితే, ఈ ఏడాది రూ.4,804 కోట్లు వసూలు అయిందని పేర్కొంది. గతేడాదితో పోల్చితే, 13.25 శాతం వసూలు పెరిగింది.