Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2018 నుంచి 505 శాతం పెరిగిన కేసులు
- 2555 శాతం ఎగబాకిన సోదాలు
- రూ. 95,432 కోట్లు అటాచ్
న్యూఢిల్లీ : మోడీ పాలనలో గత కొన్నేండ్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు అధికమయ్యాయి. ఫెమాకు సంబంధించి మనీలాండరింగ్, పీఎంఎల్ఏ కింద అనేక మంది రాజకీయ నాయకులు, వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసులను నమోదు చేస్తున్నది. ఈడీ ద్వారా నమోదైన కేసుల సంఖ్య గత నాలుగేండ్లలోనే 500 శాతానికి పైగా పెరగటం గమనార్హం. ఇలా మోడీ పాలనలో గత కొన్నేండ్లుగా ఈడీ దాడులు, నమోదు చేస్తున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను, ఆ పార్టీకి విరాళాలు ఇవ్వని సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. దాడులు, కేసులు ఎన్నున్నా వాటిలో నేర నిరూపణ రేటు కేవలం 0.5 శాతం ఉండటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను తమపై రాజకీయ ఆయుధాలుగా వాడుతున్నదని ప్రతిపక్షపార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.