Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల నోరు నొక్కే ప్రయత్నం
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత భారతం ఎలా ఉండాలో అంబేద్కర్ చెప్పి 73 సంవత్సరాలు అవుతోంది. ఆయన చెప్పిన మాటలు చెల్లవని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నిరూపిస్తోంది. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాలలో ప్రజాస్వామ్యం అవహేళనకు గురైంది. ప్రశ్నలు అడగకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పద్దులపై ఎలాంటి చర్చ జరగకుండానే ఆమోదం తెలిపారు. సాక్షాత్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు తీర్పులను తప్పుపడు తున్నారు. నిస్పాక్షికంగా వ్యవహరించి, రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ సైతం ఇదే వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ ఇలాంటి దృశ్యాలను చూసి ఉంటే దిగ్భ్రాంతి చెందే వారు.
- బీజేపీ పాలనలో రాజ్యాంగానికి తూట్లు
- గవర్నర్లు, మంత్రులు, సభాపతులదీ అదే దారి
న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే మళ్లీ వలస పాలనలోకి వెళుతున్నామా అన్న సందేహం కలుగుతోంది. నిజం...ఇటీవలి బడ్జెట్ సమావేశాలు చూసిన వారందరూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశించింది ఇదేనా అని ప్రశ్నించుకోక మానరు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకుండా అధికార పక్ష సభ్యులు అడుగడుగునా అడ్డు తగలడాన్ని చూస్తుంటే అంబేడ్కర్ భయాందోళనలు నిజమవు తున్నాయా అనిపిస్తోంది. రాజ్యాంగసభ ఏర్పడిన తర్వాత అంబేద్కర్ ఒకసారి సభలో మాట్లాడుతూ 'బ్రిటీష్ వారి కాలంలో కేవలం రెవెన్యూ వసూలు కోసమే సభను సమావేశపరిచే వారు. రోజువారీ పరిపాలనకు సంబంధించి కానీ లేదా ప్రజలను ఇబ్బందులకు గురి చేసే చట్టాలను తొలగించే విషయంలో కానీ ప్రతిపక్షాల మాటలను వారు ఖాతరు చేసే వారు కాదు'... అని అన్నారు. ఇప్పుడు జరుగుతోంది మాత్రం అందుకు భిన్నంగా ఏముంది ?. ఎక్కడైనా ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలకు అడ్డుతగలడం సహజం. కానీ అధికార పార్టీ వారే ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం ఇప్పుడే చూశాం. పార్లమెంట్ అనేది ప్రతిపక్షాల వాణిని వినిపించే వేదిక అని అంబేద్కర్ చెప్పేవారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మధ్య ఉన్న సంబంధాలపై ప్రతిపక్ష ఎంపీలు గళం విప్పకుండా పాలక పక్ష సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. హిండెన్‌బర్గ్ నివేదిక విషయంలోనూ ఇదే తంతు.ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత భారతం ఎలా ఉండాలో అంబేద్కర్ చెప్పి 73 సంవత్సరాలు అవుతోంది. ఆయన చెప్పిన మాటలు చెల్లవని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నిరూపిస్తోంది. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాలలో ప్రజాస్వామ్యం అవహేళనకు గురైంది. ప్రశ్నలు అడగకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పద్దులపై ఎలాంటి చర్చ జరగకుండానే ఆమోదం తెలిపారు. సాక్షాత్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు తీర్పులను తప్పుపడుతున్నారు. నిస్పాక్షికంగా వ్యవహరించి, రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ సైతం ఇదే వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ ఇలాంటి దృశ్యాలను చూసి ఉంటే దిగ్భ్రాంతి చెందే వారు.
రాజ్యాంగ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన పద్ధతులను పాటించకపోతే అరాచకం ఏర్పడుతుందని అంబేద్కర్ తన చివరి రాజ్యాంగసభ ప్రసంగంలో హెచ్చరించారు. ప్రస్తుత అధికార పార్టీ సభ్యులు పార్లమెంట్ సమావేశాలను ఉద్దేశపూర్వకంగా అడ్డు కోవడం చూస్తుంటే అలాంటి అరాచకం ఏర్పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
గవర్నర్లు సైతం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘన...
కొన్ని రాష్ట్రాల గవర్నర్లు సైతం ఇప్పుడు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఉదాహరణకు పంజాబ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ తొక్కిపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ గ్రీన్‌సిగల్ ఇచ్చారు. క్యాబినెట్ నిర్ణ యాలపై గవర్నర్లు ఎలాంటి షరతులూ విధించ రాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది
దేశంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే ప్రమాదం ఉందని అంబేడ్కర్ ఆనాడే ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని వారిపై దాడులు చేస్తోంది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని బలహీనపరుస్తాయి. భారత చరిత్రలో మొట్టమొదటి సారిగా అధికార పార్టీ ఎంపీలు అంబేడ్కర్ ఆశయాలను, ఆకాంక్షలను గాలికి వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత
అందరిపై ఉంది.