Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబే హైకోర్టు
ముంబయి : హేతువాది నరేంద్ర దభోల్కర్ హత్య కేసుపై సిబిఐ నిర్వహిస్తున్న విచారణపై పర్యవేక్షణను కొనసాగించబోమని బాంబే హైకోర్టు మంగళవారం ప్రకటించింది. విచారణపై పర్యవేక్షణ కొనసాగించాలని దభోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్ వేసిన పిటిషన్ను జస్టిస్ ఎఎస్ గడ్కారీ, జస్టిస్ పిడి నాయిక్తో కూడిన డివిజన్ బెంచ్ కొట్టి వేసింది. 2013 ఆగష్టు 20న పుణేలో ఉదయపు నడక చేస్తున్న దభోల్కర్ హిందుత్వ గూండాలు దారుణంగా కాల్చి చంపారు. ఈ కేసు విచారణను పుణే పోలీసుల నుంచి 2014లో సిబిఐకు అప్పగించిన హైకోర్టు అప్పటి నుంచి విచారణను పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు నివేదికలను కోర్టుకు సిబిఐ అప్పగిస్తుంది. అయితే, కేసు విచారణ ముగిసిందని, ముగింపు నివేదికను అనుమతి కోసం ప్రధాన కార్యాలయానికి దర్యాప్తు అధికారి పంపారని సిబిఐ ఈ జనవరిలో కోర్టు తెలిపింది. దీంతో పర్యవేక్షణను హైకోర్టు ఉపసంహరించుకుంది. 2014 పుణే పోలీసులు నుంచి కేసును స్వాధీనం చేసుకున్న సిబిఐ ఐదుగుర్ని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసింది. వీరిపై పుణేలోని సెషన్స్ కోర్టులో విచారణ కొనసాగుతోంది.