Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ దాఖలు చేసిన పిటీషన్ విచారణ నుంచి గుజరాత్ హైకోర్టు జడ్జి ఒకరు తనకు తానుగా తప్పుకున్నారు. 'మోడీ ఇంటిపేరు' కేసులో కింద కోర్టు తనకు విధించిన రెండేళ్ల శిక్షను ఛాలెంజ్ చేస్తూ గుజరాత్ హైకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ పిటీషన్ విచారణ నుంచి జస్టిస్ గీతాగోపి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ తరుపున న్యాయవాది పిఎస్ ఛాంపనేరి తెలిపారు. జస్టిస్ గీతా గోపి క్రిమినల్ రివిజన్ కేసులను విచారిస్తుంటారని, ఈ కారణంతోనే ఆమె ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్టు న్యాయవాది తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి లిస్ట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞాపన పంపినట్టు చెప్పారు.