Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలిక్కి రాని తెలుగు రాష్ట్రాల ఆస్తుల పంపకం
- వచ్చే వారం మరోసారి ఏపీ భవన్పై సమావేశం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేండ్లు కావస్తున్నా విభజన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఆస్తుల విభజన పూర్తి కాలేదు. విభజనకు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యల పరిష్కారం కొలిక్కి రాలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై బుధవారం కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులతో సమావేశం నిర్వహించింది. కేంద్ర హౌం శాఖ కేంద్ర, రాష్ట్రాల విభాగం జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆదిత్య నాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, ఎస్ ఎస్ రావత్ , హిమాన్షు కౌశిక్ తదితర ఉన్నతాధికారులు హాజరుకాగా, తెలంగాణ ప్రభుత్వం తరపున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీలో ఇండియా గేట్ పక్కన 20 ఎకరాలలో ఉన్న ఏడు వేల కోట్ల విలువ చేసే ఈ ఉమ్మడి ఆస్తిపై చర్చించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం వాటా చెందాల్సి ఉన్నది. ఏపీ భవన్ విభజనపై మూడు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. తొమ్మిదేండ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ జరిగింది. తాజాగా మరి కొన్ని ప్రతిపాదనలు తెరపైకి రావడంతో, వచ్చే వారం మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.