Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉడుపి: కర్ణాటకలో ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు వివిధ పార్టీలు అనేక హామీలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఉడుపి జిల్లాలోని కాపు ప్రాంతంలో మత్స్యకారులతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వారిపై హామీల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మత్య్సకారులకు రూ.10లక్షల బీమా సౌకర్యంతో పాటు వడ్డీ లేకుండా రూ.లక్ష రుణం, రోజుకు 500 లీటర్ల వరకు ఒక్కో లీటరు డీజిల్పై రూ.25ల చొప్పున రాయితీ అందించనున్నట్టు హామీ ఇచ్చారు.
బిజెపి పాలనలోని అవినీతి, ధరల పెరుగుదల మత్స్యకారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయన్నారు. బ్యాంకు రుణాలు పొందడం కూడా వీరికి కష్టంగా మారిందని ఆరోపించారు. చేపల సంఖ్య తగ్గిపోతుండటం, ఖర్చులు పెరిగిపోవడంతో వేట కష్టంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ తొలి కేబినెట్ సమావేశంలోనే అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.