Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : 'ఉచిత పథకాలు' సాంప్రదాయానికి ముగింపు పలకనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి కార్యకర్తలనుద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కాంగ్రెస్కు వారంటీ ముగిసిందని వ్యాఖ్యా నించారు. 'కార్యకర్తల కృషి వల్ల కర్ణాటకలో బిజెపి రికార్డు సీట్లు సొంతం చేసుకుంటుంది. అయితే అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే వస్తే సరిపోదు. అది పూర్తి మెజార్టీతో ఉండాలి. దేశంలో మొదటి ఎయిమ్స్ 1956లో ప్రారంభమైంది.
కానీ, ఆ తర్వాతది ఎప్పుడు వచ్చింది..? దాని గురించి కాంగ్రెస్ ఏమీ మాట్లాడదు. మేం అధికారంలోకి వచ్చాం. ఎయిమ్స్ సంఖ్యను మూడు రెట్లు పెంచాం. ఇప్పుడు చెప్పండి డబుల్ ఇంజిన్ వల్ల లాభమా..? నష్టమా..? కాంగ్రెస్ అంటేనే ఒక అబద్ధపు గ్యారంటీ. కాంగ్రెస్ ఉంటే అవినీతికి గ్యారంటీ. ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ వారంటీ ముగిసింది' అంటూ మోడీ విమర్శించారు. పార్టీ వారెంటీ ముగిసిన తర్వాత ఎన్ని హామీలిచ్చినా అర్థం లేదని పరోక్షంగా కాంగ్రెస్ గురించి వ్యాఖ్యానించారు. ఉచిత పథకాల కారణంగా ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, ఇలా అయితే దేశాన్ని, ప్రభుత్వాన్ని నడపలేమని అన్నారు.