Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీటిని పెంచాలంటున్న రాష్ట్రాలు
- 8 గంటలు చాలంటున్న ఐఎల్ఓ
న్యూఢిల్లీ : దేశంలో పని గంటలను ఎనిమిది నుండి పన్నెండుకు పెంచాలని అనేక రాష్ట్రాలు భావి స్తున్న నేపథ్యంలో దీనిపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) త్వరలోనే ఒక నివేదికను రూపొందించ బోతోంది. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న పని గంటలను ఈ నివేదిక సమీక్షిస్తుంది. పని గంటలు పెంచితే ప్రజలు పనిని, జీవనాన్ని ఎలా సమతూకం చేసుకోగలరన్న విషయాన్ని కూడా అధ్యయనం చేస్తుంది.జూలై-ఆగస్ట్ నాటికి ఐఎల్ఓ తన నివేదిక ను రూపొందిస్తుందని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది.
పని గంటలు, పని-జీవనం సమతూకం... ఈ రెండు అంశాలు కార్మిక విధానాల రూప కల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే విధానాలను నిర్ణ యించేటప్పుడు ఈ విషయాలను పాలకులు విస్మరి స్తున్నారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమ యం పని చేయడం లేదా తక్కువ సమయం పని చేయడం వంటి అంశాలను కూడా ఐఎల్ఓ పరిశీలిస్తుంది. అయితే నివేదికపై ఐఎల్ఓ ఇప్పటివరకూ అధికా రికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయ లేదు.
పని గంటలను 8 నుండి 12కు పెంచి, కార్మికు లు వారానికి 48 గంటలు పని చేసేలా చూడాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తు న్నాయి. అంటే వారానికి నాలుగు రోజుల పని దినాలు ఉంటాయి. భారత్లో నెలకొన్న పని పరిస్థితులను ఇతర ఆగేయాసియా దేశాలతో ఐఎల్ఓ పోల్చుతుంది. దేశంలో పని వాతావరణాన్ని మెరుగుపరచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సులు చేస్తుంది. వారానికి 48 పని గంటలు ఉండాలని ఐఎల్ఓ సూచిస్తూనే రోజుకు 8 గంటల చొప్పున వారానికి 6 రోజుల పని దినాలు ఉండాలని అభిప్రాయపడుతోంది. వాస్తవిక పని గంటలు, కార్మికులు కోరుకునే కాల వ్యవధిని కూడా ఐఎల్ఓ బేరీజు వేస్తుంది. పని గంటలపై ఐఎల్ఓ రూపొందించిన అంతర్జాతీయ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో మూడో వంతు ప్రజలు వారానికి 48 గంటలకు పైనే పని చేస్తున్నారు. ఐదో వంతు ప్రజలు మాత్రం వారానికి 35 గంటల కంటే తక్కువ సమయం పని చేస్తున్నారు.
పని గంటలు ఎక్కువ ఉండడం వల్ల ఎదురయ్యే సమస్యలను ఐఎల్ఓ అంతర్జాతీయ నివేదిక ప్రస్తావించింది. పని గంటలు పెరిగితే ప్రజల ఆరోగ్యంపై, వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుందని తెలిపింది. అంతేకాక వారి సామర్ధ్యం కూడా తగ్గిపోతుంది. ప్రజలకు వెసులు బాటుగా ఉండే పని గంటలను నిర్ణయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. పనిని, జీవ నాన్ని మరింత మెరుగ్గా సమతూకం చేసుకునేందుకు పని గంటలను తగ్గించాలని కూడా సూచించింది.