Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియాంకగాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : 'సూసైడ్‌నోట్' నోట్‌పై ప్రధాని జోక్ వేయటంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సున్నితమైన మానసిక ఆరోగ్య సమస్యలను అనారోగ్యకరమైన రీతిలో ఆపహాస్యం చేయటమేనని విమర్శించారు. ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ హిందీలో స్పష్టంగా మాట్లాడుతున్నారనీ, ముంబయిలో ఉండటంతో హిందీ బాగా మాట్లాడగలు గుతున్నారని అన్నారు. అనంతరం ఓ జోక్‌ను చెప్పారు. 'ఒక ప్రొఫెసర్ తన కుమార్తె రాసిన సూసైడ్ నోట్‌ను చదువుతున్నప్పుడు, అతను చాలా ఏండ్లపాటు ప్రయత్నించినప్పటికీ ఆమె స్పెల్లింగ్స్ తప్పుగా రాయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు' అని ప్రధాని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుతూ ఆ జోక్‌ను ఎంజారు చేయడం గమనార్హం. దీనిపై ప్రియాంక స్పందించారు. మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు ముఖ్యంగా యువతలో నవ్వుకునే అంశాలు కావని పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సమాచారం ప్రకారం... 2021లో 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారనీ, వీరిలో అధిక శాతం 30 ఏండ్లలోపు వారేనని అన్నారు. ఇది హృదయవిదారకమైన అంశమని తెలిపారు.