Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో ఇంటింటికీ ప్రచారం : ఎస్కేఎం కిసాన్ పంచాయత్ నిర్ణయం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించా లని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చింది. బెంగళూరులోని గాంధీ భవన్లో ఎస్కేఎం ''కిసాన్ పంచాయత్'' నిర్వహించింది. కర్నాటక రైతుల 15 డిమాండ్లు, ఒక ప్రత్యేక, తక్షణ డిమాండ్ తో కూడిన డిమాండ్ల చార్టర్ కిసాన్ పంచాయతీ విడుదల చేసింది. ఈ సమావేశంలో 20కి పైగా సంఘాలకు చెందిన 200 మంది రైతు నాయకులు హాజరయ్యారు. ఎస్కేఎం సీనియర్ జాతీయ నాయకులు హన్నన్ మొల్లా, యోగేంద్ర యాదవ్, కవిత కురుగంటి, అవిక్ సాహా పంచాయితీని ఉద్దేశించి ప్రసంగించారు. తమ హక్కులు, డిమాండ్ల కోసం రైతులు చేసిన వివిధ పోరాటా లలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులైన రైతులకు నివాళులర్పించారు.
డిమాండ్లు
1. భూ సంస్కరణల (సవరణ) చట్టం, ఏపీఎంసీ సవరణ చట్టం, పశువుల వధ నిరోధక చట్టం వంటి 2019-2020లో బీజేపీ ప్రభుత్వం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి.
2. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించే చట్టం తీసుకొచ్చినా రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీని కొనసాగించాలి.
3. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయకమైన ధరలను చట్టబద్ధంగా హామీతో కొత్త చట్టాన్ని అమలు చేయాలి.
4. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమర్థవంతమైన విపత్తు నివారణ, పంటల బీమా యంత్రాంగాల అనేక విపత్తుల కారణంగా నష్టపోతున్న వివిధ నష్టాలకు రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి.
5. రైతులు , వ్యవసాయ కార్మికు లు అప్పుల భారంతో బాధలను అనుభ వించకుండా , వ్యవసాయ నష్టాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడకుం డా ఉండేలా రుణభారం నుంచి రైతుల విముక్తి చట్టం. అలాగే రైతుల బకాయి ఉన్న వ్యవసాయ రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేయాలి.
6. భూసేకరణ, పునరావాసం , పునరావాస చట్టం (ఎల్ఎఆర్ఆర్) 2013కి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను రద్దు చేయాలి. రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి భూమిని సేకరించకూడదు.