Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 91 ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లను శుక్రవారం ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో మొత్తం 91 ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లు నేటి నుంచి పనిచేయనున్నాయి. దేశంలో ఎఫ్ఎం కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 100 వాట్ల 91 కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మీటర్లను ఏర్పాటుచేశామని అన్నారు. సరిహద్దు ప్రాంతాలు, లక్షిత జిల్లాల్లో కవరేజీని పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. దీంతో ఎఫ్ఎం అవకాశం పొందలేని 2 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ప్రధాన మంత్రి ప్రారంభించిన మన్‌కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. 'ఇది చారిత్రాత్మక చర్య. వినోదం, క్రీడలు, వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులకు చేరవేయడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని.. మన్ కీ బాత్కు ఆదరణ పెరిగిందన్నారు.